మరోసారి పోలీస్ గెటప్

మరోసారి పోలీస్ గెటప్ - Sakshi

పాత్రగా మారడానికి ఎలాంటి రిస్కీ పాట్లు పడటానికయినా సిద్ధం అయ్యే నటుల జాబితాలో అజిత్ కచ్చితంగా ఉంటారు. ఈ మధ్య ఆరంభం, వీరం వంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో మరో హిట్ కొట్టాలనే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఆరంభం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత ఎ.ఎం.రత్నం మళ్లీ అజిత్‌తోనే భారీ చిత్రాన్ని నిర్మించ తలపెట్టడం విశేషం. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో అజిత్ యువ పోలీస్ అధికారిగా నటించనున్నారని సమాచారం. ఈ మధ్య వీరం చిత్రం కోసం నలుగురు తమ్ముళ్ల అన్నయ్యగా గంభీరంగా కనిపించడం కోసం తెల్లని గడ్డం, 

 

 మీసాలతో బాడి బిల్డప్ చేసిన అజిత్ తాజాగా యువ పోలీస్ అధికారి పాత్రకు తగ్గట్లుగా బాడీని మలచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారట. ఇందుకోసం వివిధ రకాల ఎక్సర్‌సైజ్‌లు చేస్తున్నారట. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనుష్క నటించనున్నారు. ఇందులో అజిత్ మరో పాత్రను కూడా పోషించే అవకాశం ఉందని, దీంతో ఆ పాత్రకు మరో హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా చిత్ర షూటింగ్‌ను ఈ నెలలోనే ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చిత్ర నిర్మాత కార్యాలయంలోనే ప్రారంభించనున్నట్లు సమాచారం. అజిత్ శతవ చిత్రంగా రూపొందనున్న ఈ చిత్ర షూటింగ్ జూలైలోపు పూర్తి చేసి దీపావళికి తెరపైకి తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. 

 
Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top