ట్రెండింగ్‌లో స్టార్‌ హీరో పిల్లల ఫొటో!

Ajith Kids Anoushka Aadvik Photo Goes Viral - Sakshi

తమిళ స్టార్‌ హీరో అజిత్‌కు ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ కార్యక్రమం ఏదైనా అతడి పేరు వినబడితే చాలు ఈలలు, కేకలతో ప్రాంగణమంతా మోత మోగిపోవాల్సిందే. సామాన్యుడి నుంచి స్టార్‌ హీరోగా ఎదిగిన అజిత్‌ను అభిమానులు ముద్దుగా తాలా అని పిలుచుకుంటారు. సినిమాలతోనే కాకుండా కారు రేసులు, రైఫిల్‌ షూటింగ్‌ వంటి ఈవెంట్లలో కూడా దుమ్ములేపే అజిత్‌కు అభిమానులు నీరాజనాలు పడతారు. ఎంతలా అంటే కేవలం అజిత్‌ మాత్రమే కాదు అతడి పిల్లల ఫొటోలు కూడా ట్రెండింగ్‌లో నిలిచేంతగా.

ఇంతకీ విషయమేమిటంటే.... అజిత్‌ కూతురు అనౌష్క, కుమారుడు అద్వైక్‌ కలిసి ఉన్న క్యూట్‌ ఫొటో ఒకటి బుధవారం ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన అక్క అనౌష్కతో కలిసి అద్వైక్‌ నవ్వుతున్న ఫొటోకు ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. చిన్న తాలా! మరీ ఇంత క్యూట్‌గా ఉంటే ఎలా. దిష్టి తగులుతుంది కదా అంటూ #AadvikAjith హ్యాష్‌ ట్యాగ్‌తో ఫొటోను షేర్‌ చేయడంతో ట్విటర్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. కాగా హీరోయిన్‌ షాలినిని ప్రేమించిన అజిత్‌ 2000లో ఆమెను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంటకు కూతురు అనౌష్క, కొడుకు అద్వైక్‌ ఉన్నారు. ఇక ఈ ఏడాది విశ్వాసంతో హిట్‌ కొట్టిన అజిత్.. తాజాగా పింక్‌ రీమేక్ నెర్కొండ పారవైతో ప్రేక్షకులను పలకరించాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top