2018 సంవత్సరం నయనతార ఖాతాలో మరిన్ని విజయాలు చేర్చింది. ఈ ఏడాది నయన్ నటించిన కొలమావు కోకిల, ‘ఇమైకా నొడిగళ్ వంటి చిత్రాలు సూపర్ సక్సెస్ సాధించాయి. దాంతో నయన్ క్రేజ్‌కు తిరుగులేదని మరోసారి ప్రూప్ అయ్యింది. ప్రస్తుతం శివ మనసులో శక్తి ఫేమ్ ఎం రాజేష్ దర్శకత్వం వహిస్తోన్న ఎస్‌కే13 చిత్రంలో నటిస్తున్నారు నయన్. శివకార్తికేయ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం అజెర్‌బైజాన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.
#SK13onSpot Adorable 💝 pic.twitter.com/153IZ7GnDD
— Nayanthara✨ (@NayantharaU) December 14, 2018
అయితే షూటింగ్ స్పాట్‌లో తీసిన ఓ వీడియో ఇప్పుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. షూటింగ్ స్పాట్‌లో నయన్ ఓ చిన్నారితో ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉన్న ఆ చిన్నారి, నయన్‌తో కలిసి ఫోటోలకు పోజులిస్తూ తెగ అల్లరి చేస్తోంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
