ఆ హీరోయిన్ పెళ్లైపోయింది | Actress Ankita Jhaveri Vishal Jagtap Marriage | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్ పెళ్లైపోయింది

Mar 30 2016 10:18 AM | Updated on Aug 28 2018 4:30 PM

ఆ హీరోయిన్ పెళ్లైపోయింది - Sakshi

ఆ హీరోయిన్ పెళ్లైపోయింది

హీరోయిన్ అంకిత సోమవారం పెళ్లి చేసుకుంది. పుణేకు చెందిన వ్యాపారవేత్త విశాల్ జగ్తాప్ ను ఆమె వివాహమాడింది.

ముంబై: హీరోయిన్ అంకిత సోమవారం పెళ్లి చేసుకుంది. పుణేకు చెందిన వ్యాపారవేత్త విశాల్ జగ్తాప్ ను ఆమె వివాహమాడింది. ముంబై వర్లీ ప్రాంతంలో ఓ స్టార్ హోటల్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

రస్నాబేబీగా పాపులర్ అయి ఆ తరువాత బాలతారగా పలు చిత్రాలలో నటించింది. 'లాహిరి లాహిరి లాహిరి' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. తెలుగు తమిళ, కన్నడ భాషాల్లో 20 పైగా చిత్రాల్లో నటించింది. సింహాద్రి, విజయేంద్రవర్మ, అందురూ దొంగలే దొరికితే, మనసు మాట వినదు, ఖతర్నాక్, సీతారాములు, నవ వసంతం, అనసూయ, వినాయకుడు, అర్జునుడు, పోలీస్ అధికారి తదితర తెలుగు సినిమాల్లో కనిపించింది.

కొంత కాలం క్రితం నటనకు దూరం అయిన అంకిత న్యూయార్క్ వెళ్లి అక్కడ సినిమాకు సంబంధించిన కోర్స్ చేసింది. ఆ సమయంలో పరిచయం అయిన వ్యాపారవేత్త విశాల్‌తో అంకిత లవ్ లో పడింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి పెళ్లి చేయడంతో ప్రేమకథ సుఖాంతం అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement