హిరణ్యకశిపుడిని పరిచయం చేస్తూ 'మహావతార్‌' ప్రోమో విడుదల | Hiranyakashipu Promo Out From Mahavatar Narsimha Movie | Sakshi
Sakshi News home page

హిరణ్యకశిపుడిని పరిచయం చేస్తూ 'మహావతార్‌' ప్రోమో విడుదల

Jul 1 2025 1:41 PM | Updated on Jul 1 2025 3:06 PM

Hiranyakashipu Promo Out From Mahavatar Narsimha Movie

హోంబలే ఫిల్మ్స్‌ సంస్ధ నిర్మిస్తున్న భారీ యానిమేటెడ్‌ చిత్రం 'మహావతార్‌: నరసింహ'..  రాక్షస రాజు హిరణ్యకశిపుడి పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు మంచి ఆదరణ లభించింది. జులై 25న పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. కేజీఎఫ్‌,సలార్‌,కాంతార వంటి భారీ ప్రాజెక్ట్‌లను నిర్మించిన ఆ సంస్థ దర్శకుడు అశ్విన్‌ కుమార్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  సామ్‌ సీఎస్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. శిల్పా ధావన్‌, కుశాల్‌ దేశాయ్‌, చైతన్య దేశాయ్‌లు నిర్మిస్తున్నారు.  మహావతార్‌ సిరీస్‌లో భాగంగా వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అయితే, ఈ కథకు సీక్వెల్‌గా ఇతర అవతారాలతో పలు సినిమాలు రానున్నాయన మేకర్స్‌ హింట్‌ ఇచ్చారు. యానిమేషన్‌లో ఈ చిత్రం ఒక బెంచ్‌ మార్క్‌ను సెట్‌ చేస్తుందని దర్శకుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement