నేను పబ్లిక్‌ ప్రాపర్టీ కాదు!

Actor Sivakumar says fan selfie was an invasion of privacy, apologises - Sakshi

సెలబ్రిటీలకు ఉండే క్రేజే వేరు. అందులోనూ సినిమా నటీనటులంటే జనాల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. అందుకే వారు ఎక్కడ కనిపించినా ఫొటోల కోసం ఎగబడుతుంటారు. ఇది ఒక్కోసారి ఆ సెలబ్రిటీలకు ఇబ్బంది కలిగిస్తుంటుంది. తాజాగా తమిళ నటుడు శివకుమార్‌కి (హీరో సూర్య, కార్తీల తండ్రి) అలాంటి ఇబ్బందే ఎదురైంది. తనతో సెల్ఫీ తీసుకోబోయిన ఓ అభిమాని ఫోన్‌ లాక్కొని శివకుమార్‌ విసిరివేశారు. ఇది కాస్తా హాట్‌ టాపిక్‌ కావడంతో శివకుమార్‌ స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. ‘‘సెల్ఫీల విషయంలో ఎవరి ఇష్టం వారిది. కానీ, ఒక సెలబ్రిటీ విషయంలో అలా చేయడం కరెక్ట్‌ కాదు. ఓ 25 మంది అభిమానులు సెక్యూరిటీ గార్డులను పక్కకు తోసేసి మరీ నా దగ్గరికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు.

ఒక సెలబ్రిటీతో సెల్ఫీ దిగాలనుకుంటే ముందు వారి అనుమతి తీసుకోవాలి. నేనేమీ పబ్లిక్‌ ప్రాపర్టీ కాదు. నాకూ ప్రైవసీ ఉంటుంది. గతంలో చాలాసార్లు అభిమానులు సెల్ఫీ అడిగితే కాదనలేదు. నన్ను నేను ఓ బుద్ధుడిలానో లేదా ఓ సాధువులానో భావించడం లేదు. నేనూ మీలాగే సాధారణ మనిషిని. నాకు నచ్చినట్లుగా జీవిస్తున్నాను. నన్ను ఓ నేతగానో..  ఓ సూపర్‌స్టార్‌గానో చూడాలని కోరడం లేదు. ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో హీరోలే. కానీ, మనం చేసే పనులు ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు’’ అని శివకుమార్‌ పేర్కొన్నారు. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top