'మానాన్న ఆరోగ్యంపై వచ్చే రూమర్లను నమ్మకండి' | Actor Sadashiv Amrapurkar on life support, condition stable | Sakshi
Sakshi News home page

'మానాన్న ఆరోగ్యంపై వచ్చే రూమర్లను నమ్మకండి'

Oct 27 2014 12:45 PM | Updated on Sep 2 2017 3:28 PM

'మానాన్న ఆరోగ్యంపై వచ్చే రూమర్లను నమ్మకండి'

'మానాన్న ఆరోగ్యంపై వచ్చే రూమర్లను నమ్మకండి'

బాలీవుడ్ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, గత కొద్ది రోజులతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని..

ముంబై: బాలీవుడ్ నటుడు సదాశివ్ అమ్రాపుర్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, గత కొద్ది రోజులతో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ఆయన కూతురు రీమా తెలిపారు. ఊపిరితిత్తుల్లో ఇన్ ఫెక్షన్ కారణంగా సదాశివ్ కోకిలాబెన్ ధిరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరారు. 
 
'సదాశివ్ జీ ఆరోగ్య పరిస్థితి కొంత కుదుటపడిందని, వెంటిలెటర్ ద్వారా శ్వాసనందిస్తున్నారు. ఆయన గురించి మీడియాలో వస్తున్న రూమర్లను నమ్మకండి. మీడియాకు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలను అందిస్తాను' అని మీడియాకు పంపిన ఓ ప్రకటనలో రీమా తెలిపారు. 
 
అర్ధసత్య చిత్రం ద్వారా బాలీవుడ్ కు పరిచయమై.. సడక్ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సదాశివ్ అమ్రాపుర్కర్ పలు హిందీ చిత్రాల్లో కనిపించారు. 2012లో ఆయన 'బాంబే టాకీస్' చిత్రంలో చివరిసారిగా నటించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement