ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న '1 నేనొక్కడినే' చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.
ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న '1 నేనొక్కడినే' చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. టీజర్ లో కృతి సనన్, మహేశ్ లపై చిత్రీకరించిన పాట అభిమానులను, సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల రిలీజైన ఆడియోకు మంచి స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. మహేశ్ బాబు, కృతి సనన్ జంటగా నటించిన '1 నేనొక్కడినే' చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10 తేదిన విడుదలకు ముస్తాబవుతోంది.