ప్రేమికులు! ఈ రోజు ఇలా చేయకండి.. 

Valentine's Day 2020: Don't Do These Things With Your Best Half On Feb 14th - Sakshi

ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వాలెంటైన్స్‌ డే రానే వచ్చింది. ప్రియమైన వారితో ఈ రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకునేవారు చాలామందే ఉంటారు. గిఫ్టులు, సరదా షికార్లు, రొమాంటిక్‌ డిన్నర్లతో ఈ రోజును మరింత మధురంగా మార్చుకోవాలనే ప్లాన్స్‌ ఉండనే ఉంటాయి. అయితే టూసైడ్‌ లవ్‌లో ఉన్న వారు ఈ రోజున మీరు చేయకూడని కొన్ని పనులను దృష్టిలో ఉంచుకోవాలి. వాటి గురించి తెలుసుకుని, ఎదుటి వ్యక్తి సంతోషం కోసమైనా జాగ్రత్తగా ఉండాలి.

1)  వాలెంటైన్స్‌ డే వేడుకలు
నిజానికి చాలా మంది ప్రేమికులు వాలెంటైన్స్‌ డేను సెలబ్రేట్‌ చేసుకోవటానికి ఇష్టపడరు. బహుశా మీకు కూడా వాలెంటైన్స్‌ డే జరుపుకోవటం నచ్చకపోవచ్చు. కానీ, ఎదుటి వ్యక్తి ఈ రోజును సెలబ్రేట్‌ చేయటానికి ఇష్టపడుతున్నా, మనల్ని సంతోషపెట్టటానికి ప్రయత్నిస్తున్నా.. మీరు కొద్దిగా ఆలోచించాలి. ‘ నాకు వాలెంటైన్స్‌ డే జరుపుకోవటం ఇష్టంలేదు’ అంటూ వారి ముఖాన చెప్పేయకుండా ఉండటం మంచిది. భాగస్వామి సంతోషానికి ప్రాధాన్యత ఇస్తే మరింత మంచిది.    

2) మాజీ భాగస్వామి 
ఉదా : ‘ నేను నిన్ను కావ్య (మాజీ భాగస్వామి) కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా’ అని మాత్రం చెప్పకండి. ఈ రోజునే కాదు ఎప్పుడు కూడా. మీరు ఎదుటి వ్యక్తిపై ఉన్న ప్రేమను వ్యక్తపర్చడానికే ఇలా చెప్పిఉండవచ్చు. కానీ, దీని వల్ల పెద్దగా నష్టం లేకపోయినా. ఆ మాటలు మీ భాగస్వామి మూడ్‌ను నాశనం చేయవచ్చు.

3) విమర్శనాత్మక ప్రమాణాలు
‘ నువ్వు ముసలి దానిలా ఉన్నావు.. బరువెక్కావు.. అయినా నేను ప్రేమిస్తున్నాను. నువ్వు ఎలా ఉన్నా ఎప్పటికీ ప్రేమిస్తుంటాను’. మీరు ఎదుటి వ్యక్తిని విమర్శిస్తున్నామన్న భావన బహుశా మీకు కలుగపోవచ్చు. వారిపై మీకున్న ప్రేమను ఇలా వ్యక్తపర్చిఉండవచ్చు. కానీ, వారి లోపాలను ఇది ఎత్తి చూపటం లాంటిదే. మీ మాటలు వారికి విపరీతమైన కోపం తెప్పించవచ్చు.

4) వేడుకల రద్దు
వాలెంటైన్స్‌ డేను జరుపుకోవటానికి వేసుకున్న ప్లాన్‌లను చిన్న చిన్న కారణాలకు రద్దు చేసుకోవద్దు. ఇది మీ భాగస్వామిని తీవ్ర నిరాశకు గురిచేయవచ్చు. 

5) బంధంపై జోకులు 
ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉండే జంటల మధ్య బంధం దృఢంగా ఉంటుందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బంధంపై సెటైర్లు వేసుకుంటూ.. ఎదుటి వ్యక్తిని కించపర్చేలా జోకులు వేస్తే మాత్రం బంధం మూడు ముక్కలవుతుంది. ‘‘ నేను ఆ రోజు జోక్‌గా ఐ లవ్‌ యూ చెబితే నువ్వు సీరియస్‌గా తీసుకున్నావు. నేనూ కూడా టైం పాస్‌కు సర్దుకుపోతున్నా’’ అంటూ కామెడీ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు..

Read latest Lifestyle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top