మేఘాల్లో పెళ్లికి రెడీయేనా? | Wedding at 700 ft above ground | Sakshi
Sakshi News home page

మేఘాల్లో పెళ్లికి రెడీయేనా?

Apr 24 2014 6:38 PM | Updated on Sep 2 2017 6:28 AM

మేఘాల్లో పెళ్లికి రెడీయేనా?

మేఘాల్లో పెళ్లికి రెడీయేనా?

ఆకాశం మీద 700 అడుగుల మీద పెళ్లి... ఆలోచనే అద్భుతంగా ఉంది కదూ!

ఆకాశం మీద 700 అడుగుల మీద పెళ్లి... ఆలోచనే అద్భుతంగా ఉంది కదూ!

ఇలాంటి ఆకాశ పరిణయం చేసుకోవాలంటే దుబాయ్ లో సముద్రం మధ్యలో ఉన్న హోటల్ బుర్జ్ అల్ అరబ్ కి వెళ్లాల్సిందే.
ప్రపంచంలోనే అతి విలాసవంతమైన హోటల్ గా పేరొందిన ఈ హోటల్ లో మేఘాలను ముద్దాడుతూ, సాగర జలతరంగాల్ని చూస్తూ,  హెలీకాప్టర్ మీద వచ్చి సరిగ్గా పెళ్లి పందిరి దగ్గర దిగి కలల వివాహం చేసేసుకోవచ్చు. ఇలాంటి పెళ్లి ఫుట్ బాల్ ప్లేయర్ వేన్ రూనీ, ఫార్ములా వన్ రేసర్ లూయీస్ హామిల్టన్, మోడల్ క్లాడియా షిఫర్ లు చేసుకున్నారు.

వాళ్ల జాబితాలో మీరు చేరుకోవాలనుకుంటున్నారా? మేఘాల పై తేలిపోతూ, తూఫానులా రేగిపోతూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పెళ్లికి 55000 అమెరికన్ డాలర్ల రుసుము చెల్లించాలి. ప్రతి వస్తువుకీ అదనపు చార్జీలుండాయి. పర్సు నిండా నోట్లుంటే బుర్జ్ అల్ అరేబియా వెడ్డింగ్ కి రెడీ కండి!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement