
పక్కన వారు ప్రమాదంలో ఉంటే.. మనకెందుకులే అని వదిలేసే ఈ కాలంలో ఓ వ్యక్తి ప్రమాదానికి ఎదురెళ్లి ఒకరిని కాపాడిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. వరదల్లో చిక్కుకుని ఓ కారు కొట్టుకుపోతుంటే.. ఓ వ్యక్తి వచ్చి ఆ కారులో ఉన్న మహిళను కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా తిరుగుతోంది.
కారు వరదల్లో చిక్కుకుని ఉంటే... దాంట్లో ఎవరైనా ఉండొచ్చన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆ కారుపై దూకాడు. పక్కన రోడ్డుపై ఉన్న వ్యక్తి ఓ రాయి లాంటి దాన్ని విసరడంతో... దాని సహాయంతో కారుపై ఉండే అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నం చేస్తుండగా... ఇంతలో మరో ఇద్దరు కూడా వరదలో ఈదుకుంటూ వచ్చారు. వారు కూడా కారు అద్దాలను పగలగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. కారు పై అద్దాలను పగలగొట్టి.. అందులో ఉన్న ఓ అమ్మాయిని కాపాడుతాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.