ఆ కవలలు పుట్టిన సంవత్సరాలు వేరు! | Twins Born In Two Different Years | Sakshi
Sakshi News home page

ఆ కవలలు పుట్టిన సంవత్సరాలు వేరు!

Jan 4 2016 2:29 PM | Updated on Oct 17 2018 4:29 PM

ఆ కవలలు పుట్టిన సంవత్సరాలు వేరు! - Sakshi

ఆ కవలలు పుట్టిన సంవత్సరాలు వేరు!

వాళ్లిద్దరూ కవల పిల్లలు. కానీ వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు.

వాళ్లిద్దరూ కవల పిల్లలు. కానీ వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? విషయం ఏమింటంటే కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతానికి చెందిన మారిబెల్ వాలెన్షియా అనే మహిళ 2015 డిసెంబర్ నెలాఖరులో ఆస్పత్రిలో కాన్పు కోసం చేరారు. అక్కడ ఆమెకు 31వ తేదీ రాత్రి జేలిన్ అనే అమ్మాయి తొలుత పుట్టింది. ఆ తర్వాత కొద్ది నిమిషాల తర్వాత.. అంటే, 2016 జనవరి ఒకటో తేదీ తెల్లవారుజామున 12.02 నిమిషాలకు లూయిస్ అనే కొడుకు పుట్టాడు. దాంతో కవల అక్కాతమ్ముళ్లు ఇద్దరూ వేర్వేరు సంవత్సరాలలో పుట్టినట్లు అయ్యింది.

ఇది చూసిన ఆ తల్లిదండ్రుల సంతోషానికి పట్టపగ్గాలు లేవు. నిజానికి వీళ్లిద్దరూ కూడా జనవరి నెలాఖరులోనే పుడతారని వైద్యులు భావించారు. కానీ అలా జరగకుండా తమ తల్లిదండ్రులకు ఆనందం మిగిల్చారు. ఈ కవలల తల్లి శాండియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాషియర్‌గా పనిచేస్తుంటే, ఆమె భర్త లూయిస్ యునైటెడ్ స్టేట్స్ నేవీలో డీజిల్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వీళ్లకు ఇప్పటికే మూడేల్ల ఇసబెల్లా అనే కూతురు కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement