కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం

Three Indian Students Die In Canada Car Crash - Sakshi

జలంధర్‌ : కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. వారిని పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌, జలంధర్‌ జిల్లాలకు చెందిన తన్వీర్‌ సింగ్‌, గుర్విందర్‌, హర్‌ప్రీత్‌ కౌర్‌లుగా గుర్తించారు. ఉన్నత విద్య కోసం కెనడాలకు వెళ్లిన వీరు శుక్రవారం అర్ధరాత్రి కారులో బయటకు వెళ్లారు. అయితే వీరి వాహనం ఒంటారియోలోని అయిల్‌ హరిటేజ్‌ రోడ్డులో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు అక్కడి అధికారులు తెలిపారు.

ఈ వార్తతో బాధిత కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తన్వీర్‌ ఈ ఏడాది ఆరంభంలో కెనడాకు వెళ్లగా.. మిగిలిన ఇద్దరు ఏప్రిల్‌లో అక్కడికి వెళ్లినట్టు వారి కుటుంబసభ్యులు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top