'ట్రంప్‌తో భయమొద్దు.. మేమున్నాం' | Sakshi
Sakshi News home page

'ట్రంప్‌తో భయమొద్దు.. మేమున్నాం'

Published Mon, Jan 30 2017 3:55 PM

'ట్రంప్‌తో భయమొద్దు.. మేమున్నాం' - Sakshi

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేసిన పనికి మొత్తం ప్రపంచ నివ్వెరపోతుండగా ఇప్పటికే అమెరికాలో ఉన్న వలసదారులు వణికిపోతున్నారు. ముఖ్యంగా వివిధ ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తున్న ముస్లింలు బెంబేలెత్తిపోతున్నారు. ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న ముస్లింలలో చాలామంది ట్రంప్‌ ప్రస్తుతం నిషేధం విధించిన దేశానికి సంబంధించిన దేశాల వారు ఉండటమే అందుకు కారణం.

అవును ప్రపంచంలోనే ప్రముఖ టెకీ సంస్థలుగా ఉన్న గూగుల్‌, ఆపిల్‌, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, లింక్‌డిన్‌వంటి సంస్థలు ట్రంప్‌ చర్యలను తీవ్రంగా ఖండించడమే కాకుండా తమ సంస్థల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు అండగా నిలుస్తున్నారు.

గూగుల్‌.....
ఇప్పటికే వీసాగానీ, గ్రీన్‌ కార్డుగానీ ఉన్న ఏడు నిషేధిత దేశాలకు చెందిన ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వారు తమ ప్రయాణాలు రద్దు చేసుకోవాల్సిందిగా గూగుల్‌ టెక్‌ 30 సంస్థ వారికి తెలియజేసింది. బ్యాన్‌ ఎత్తివేసే వరకు అమెరికా వెలుపల తిరిగే పనులెవరూ పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

ఆపిల్‌ కంపెనీ సీఈవో టిమ్‌కుక్‌...
తన ఉద్యోగస్తుల గురించి తీవ్ర ఆందోళన చెందుతూ కుక్‌ ఈ మెయిల్‌ ద్వారా తన ఉద్యోగస్తులకు ఒక లేఖ విడుదల చేశారు. వలసదారుల సహాయం లేకుండా ఆపిల్‌ ఇంత స్థాయికి చేరుకోదని, ట్రంప్‌ పాలసీని తాము అంగీకరించబోమని మీరేం భయపడొద్దని వారికి భరోసా ఇచ్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు.

మైక్రోసాఫ్ట్‌....
ప్రస్తుతం ఈ కంపెనీ నడుపుతున్న భారతీయ అమెరికన్‌ సత్య నాదెళ్ల కూడా ట్రంప్‌ పాలసీని వ్యతిరేకించారు. ఆయన తన ఉద్యోగులకు అండగా నిలిచి వారికి లీగల్‌ పరమైన సహాయం అందిస్తామని అన్నారు. నిషేధానికి గురైన దేశాలకు చెందిన 76మంది ఆయన సంస్థలో ఉన్నట్లు తెలిసింది. సత్యనాదెళ్ల కూడా భారత్‌ నుంచి వలస వెళ్లిన వ్యక్తే.

అమెజాన్‌.........
మరో ఆన్‌లైన్‌ వ్యాపార దిగ్గజం అమెజాన్‌ తన ఉద్యోగస్తులకు ఒక ఈమెయిల్‌ పంపించింది. ట్రంప్‌ కొత్త ఆదేశాల ప్రభావానికి గురైన తమ వారికి అండగా ఉంటామని, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి పనిచేసిన వారి వల్లే తమ సంస్థ ఇంతగా అభివృద్ధి చెందిందని.. అమెజాన్‌ను గొప్పగా తీర్చిదిద్దిందని పేర్కొంటూ ఎవరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చింది.

ఫేస్‌బుక్‌.....
ఇక ఫేస్‌ బుక్‌ సీఈవో ట్రంప్‌ నిర్ణయం వచ్చిన రోజే వ్యతిరేకించిన విషయం తెలిసిందే. తన జీవితం ఈరోజు ఇంత అద్భుతంగా ఉందంటే అది ఇమ్మిగ్రేషన్‌ వచ్చిన వారి కష్టం వల్లే అంటూ ఆయన పేర్కొన్నారు. శరణార్ధులకు మనం ఎప్పుడూ తలుపులు తెరిచేఉంచాలని, వారికి సహాయం అందించాలని అన్నారు. శ్రామికశక్తిపై ప్రభావం పడితే సొంత దేశ ప్రజలను వారి కుటుంబాలను ఎలా రక్షించుకుంటామని ప్రశ్నించారు. తమ కంపెనీలో పనిచేసే నిషేధ దేశాల ముస్లింలకు లీగల్‌ పరంగా కావాల్సిన సహాయం చేస్తామని చెప్పారు. 

దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి

(అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..)

(ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్‌)

(ట్రంప్‌ ‘నిషేధం’: ఐసిస్‌ విజయోత్సవాలు)

(ట్రంప్‌ చెప్పింది పచ్చి అబద్ధం!)

(అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి)

(ట్రంపోనమిక్స్‌ మనకు నష్టమా? లాభమా?)

(ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!)

(ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!)

(వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా)

Advertisement

తప్పక చదవండి

Advertisement