పాకిస్తాన్‌ మంత్రిపై జోక్సే జోక్స్‌!

Social Media Splits After Pakistan Govt Says Imran Khans Daily Helicopter Ride Costs Only Rs 55 - Sakshi

అయ్యో ఆ హెలికాప్టర్‌ ఎత్తుకుపోగలా! 

సోషల్‌ మీడియాలో సెటైర్లు

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ నూతన ప్రధాని, మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ఖాన్‌ మరోసారి హాట్‌ టాపిక్‌ అయ్యారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వీఐపీ సాంప్రదాయాన్ని పక్కన బెట్టి నూతన పాకిస్తాన్‌ నిర్మిస్తానని ఆయన హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ హామీని నిలబెట్టుకోకుండా హెలికాప్టర్‌లను ఉపయోగించడంపై సర్వత్రా విమర్శలొచ్చాయి. దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన ఆదేశ సమాచార శాఖ మంత్రి ఫావద్‌ చౌదర్‌పై సోషల్‌ మీడియాలో జోకులు పెలుతున్నాయి. ఇమ్రాన్‌ నిర్మిస్తానన్న కొత్త పాక్‌ ఇదేనా అంటూ నెటిజన్లు సెటైర్‌ వేస్తున్నారు.

ఇంతకీ ఆ మంత్రిగారు ఏమన్నారంటే.. ఇమ్రాన్‌ ఖాన్‌ ఉపయోగించే హెలికాప్టర్‌ ఇంధన ఖర్చు చాలా తక్కువని, కిలోమీటర్‌ కేవలం రూ.55 అని తెలిపారు. మంత్రిగారి అవగాహన రాహిత్యాన్ని క్యాచ్‌ చేసుకున్న నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. తమ ఫొటోషాప్‌ నైపుణ్యానికి పనిచెప్పి మరి ట్రోల్‌ చేయసాగారు. మంత్రిగారు ఇలా చెప్పకండి ఆ హెలికాప్టర్‌ ఎత్తుకుపోతారని ఒకరు కామెంట్‌ చేయగా.. ‘ఇలా అయితే మీరు నిర్మించే కొత్త పాకిస్తాన్‌లో ఉబర్‌ రూ.50లకే హెలికాప్టర్‌ సేవలు తీసుకొస్తదన్నమాట’ అని ఇంకొకరు సెటైర్‌ వేశారు. కొందరేమో అది సైకిల్‌ కాదని, హెలికాప్టర్‌ అని చురకలంటించారు. మరికొందరు అసలు లెక్క ఎంతో.. ఎలా లెక్కిస్తారో తెలుపుతూ ట్వీట్‌ చేశారు. వెంటనే ప్రజల కోసం హెలికాప్టర్‌ సేవలు ప్రారంభించండని ఇంకొకరు సూచించారు. ఇమ్రాన్‌ హెలికాప్టర్‌ ఇంధన ఖర్చు కిలోమీటర్‌కు రూ.7 వేలు ఖర్చువుతుందని స్థానిక మీడియా పేర్కొంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top