మే 8న మండిపోనున్న రష్యా వ్యోమనౌక | Russian space shuttle will burn on may 8 | Sakshi
Sakshi News home page

మే 8న మండిపోనున్న రష్యా వ్యోమనౌక

May 7 2015 1:14 AM | Updated on Sep 3 2017 1:33 AM

భూమి చుట్టూ తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లోని వ్యోమగాములకు సరుకులు తీసుకెళ్లి దారితప్పిన రష్యా ‘ప్రోగ్రెస్’ వ్యోమనౌక శుక్రవారం భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోనుంది.

మాస్కో: భూమి చుట్టూ తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లోని వ్యోమగాములకు సరుకులు తీసుకెళ్లి దారితప్పిన రష్యా ‘ప్రోగ్రెస్’ వ్యోమనౌక శుక్రవారం భూ వాతావరణంలోకి ప్రవేశించి మండిపోనుంది. శుక్రవారం మధ్యాహ్నం 1:23 నుంచి రాత్రి 9:55 గంటల మధ్య ఈ వ్యోమనౌక కూలిపోనుందని బుధవారం రష్యా అంతరిక్ష సంస్థ ‘రాస్‌కాస్మోస్’ వెల్లడించింది.

వ్యోమనౌక పూర్తిగా నింగిలోనే మండిపోనుందని, దానికి చెందిన కొన్ని శకలాలు మాత్రమే భూమిపై పడే అవకాశముందని తెలిపింది. ఐఎస్‌ఎస్‌కు ఏప్రిల్ 28న రాకెట్ ద్వారా పంపిన మానవ రహిత ప్రోగ్రెస్ వ్యోమనౌక సరైన కక్ష్యకు చేరకపోవడంతో పాటు నియంత్రణ కోల్పోవడం, భూమి చుట్టూ తిరుగుతూ క్రమంగా నేలవైపు ప్రయాణిస్తుండటం తెలిసిందే. 2011లో కూడా రష్యాకు చెందిన ఓ ప్రోగ్రెస్ వ్యోమనౌక ప్రయోగించిన వెంటనే సైబీరియాలో కూలిపోయింది.

Advertisement

పోల్

Advertisement