పాక్‌ ముసుగు తొలగించిన ముషార్రఫ్‌

Pervez Musharraf Says Pak Intelligence Used Jaish For Attacks In India - Sakshi

ఇస్లామాబాద్‌: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విషయంలో పాకిస్తాన్‌ వైఖరిని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషార్రఫ్‌ బహిర్గతం చేశారు. భారత్‌పై దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్‌ను పాక్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ను వినియోగిస్తుందని తెలిపారు. పాకిస్తాన్‌ జర్నలిస్ట్‌ నదిమ్‌ మాలిక్‌కు ఇచ్చిన టెలిఫోనిక్‌ ఇంటర్వ్కూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థ అయినప్పటికీ.. తన పాలన కాలంలో దానిని భారత్‌పై దాడుల కోసం ఇంటెలిజెన్స్‌ వాడుతుండేదని పేర్కొన్నారు. తాను అధ్యక్షుడుగా ఉన్న కాలంలోనే జైషే సంస్థ తనను రెండు సార్లు హత్య చేసేందుకు యత్నించిదని ఆరోపించారు.

అయితే మీ పాలనలో ఉగ్ర సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆ జర్నలిస్ట్‌ ముషార్రఫ్‌ను ప్రశ్నించారు. దీనికి ముషార్రఫ్‌ అప్పటి పరిస్థితులు చాలా భిన్నమైనవని.. ఆ కాలంలో భారత్‌, పాక్‌లు రహస్యంగా పోరాడేవని వ్యాఖ్యానించారు. ఇందుకోసం పాక్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థలు పనిచేసేవని పేర్కొన్నారు. ఉగ్ర నివారణ చర్యల్లో భాగంగా జైషే మహమ్మద్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని.. తాను కూడా అందుకోసం ఒత్తిడి తీసుకురాలేదని అన్నారు. కాగా, పుల్వామా ఉగ్రదాడితో పాటు భారత్‌లో జరిగిన చాలా ఉగ్ర దాడుల వెనుకు జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ హస్తం ఉన్న సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top