కరోనా విజృంభణ.. పాపం పాక్‌ పౌరులు | Pakistan Not evacuate Students From China Over Carona | Sakshi
Sakshi News home page

కరోనా విజృంభణ.. చేతులెత్తిసిన పాక్‌

Feb 3 2020 3:54 PM | Updated on Feb 3 2020 5:06 PM

Pakistan Not evacuate Students From China Over Carona - Sakshi

బీజింగ్‌ : చైనాలో ప్రాణంతక కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. ముఖ్యంగా వుహాన్‌ నగరంలో ఈ వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. స్వల్ప సమయంలోనే చైనా సరిహద్దుల్లోని దాదాపు 15 దేశాలకు ఈ వ్యాధి సంక్రమించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారి నుంచి తమ పౌరులను కాపాడుకునేందుకు ఆయా ప్రభుత్వాలు వేగంగా స్పందిస్తున్నాయి. పొరుగు దేశంలోని భారతీయ పౌరులకు కాపాడుకునేందుకు భారత ప్రభుత్వం వేగవంతమైన చర్యలను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే పాకిస్తాన్‌ మాత్రం దీనికి విరుద్ధంగా చైనాలోని తమ పౌరులను రక్షించలేమని చేతులెత్తేసింది. తమ దేశంలో మెరుగైన వైద్య సదుపాయాలు లేవని, కరోనాను తట్టుకునేంత ఆర్థిక స్తోమత కూడా లేదని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చైనాలో ఏర్పాటు చేసిన నిర్బంధ కేంద్రాల్లోనే పాక్‌ పౌరులు ఉండాల్సి వచ్చింది. మరోవైపు తమ దేశ పౌరులను కాపాడాల్సిందిగా పాక్‌ ప్రభుత్వం చైనాను వేడుకుంటోంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సమస్యలతో దేశం సంక్షోభంలో ఉందని.. కరోనాను ఎదుర్కొనే శక్తి తమ వద్దలేదని చైనాను ప్రాధేయపడుతోంది. (చైనా సంకల్పం : కేవలం 10 రోజుల్లోనే..)

మరోవైపు కరోనా విజృభణకు చైనాలోని పాక్‌ పౌరులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. వుహాన్‌తో సహా వివిధ నగరాల్లో దాదాపు 60 మందికి పైగా పాక్‌ పౌరులు కరోనా భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. ప్రత్యేక విమానం ద్వారా తమను సొంత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. ఒకపక్క భారతీయులను రక్షించేందుకు ఆ దేశ  ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంటే పాక్‌ ప్రభుత్వం మాత్రం తమవల్ల కాదంటు చేతులెత్తేయడంతో ఆదేశ పౌరులు తీవ్ర అసంహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తమగోడును వెల్లబోసుకుంటున్నారు. తమను రక్షించాల్సిందిగా కోరుతున్నారు. కాగా ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్‌ వ్యాప్తిస్తున్న తరుణంలో వుహాన్‌ నుంచి భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానం బోయింగ్‌ 747 కేటాయించింది. వుహాన్‌ నుంచి ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానంలో 324 మంది భారతీయులను ఢిల్లీకి తరలించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement