దారి తప్పుతున్న దిక్కులు!

North Pole And South Pole Directions Are Changing - Sakshi

వేగంగా తారుమారవుతున్న ధృవాలు

కదిలిపోతున్న భూపొరల్లోని అయస్కాంత క్షేత్రాలు

ఏడాదికి 50 కిలోమీటర్ల మేర ఉత్తర ధృవం కదలికలు

గూగుల్‌ మ్యాప్స్, నావిగేషన్‌ వ్యవస్థలకు కష్టకాలమే..

త్వరలోనే ఈ వ్యవస్థలను మార్చుకోవాలంటున్న శాస్త్రవేత్తలు

స్మార్ట్‌ఫోన్‌లో మ్యాప్స్‌ అప్లికేషన్‌ వాడుతుంటారా..?
తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే దీన్నే ఉపయోగిస్తారా..?
ఏ మారుమూల ప్రాంతాలనైనా భలే గుర్తుపడుతుంది కదా..
ఈ సౌకర్యానికి రోజులు దగ్గరపడ్డాయి..
ఎందుకంటే భూ అయస్కాంత ధృవం వేగంగా కదిలిపోతోంది!
దీంతో మ్యాప్స్‌లాంటి దిక్సూచిలన్నీ కకావికలం కానున్నాయి!

అయస్కాంత ధృవమేంటీ..? కదిలిపోవడం ఏంటీ? స్మార్ట్‌ ఫోన్లకూ వాటికీ లింకేంటీ.. ఇవేగా మీ మనసులో మెదు లుతున్న ప్రశ్నలు. భూమి ఒక అయస్కాంతం లాంటిదని పుస్తకాల్లో చదువుకున్నాం. ఈ అయ స్కాంతానికి ఉత్తర దక్షిణ ధృవాలు ఉం టాయి. ఇవి కంటికి కనిపించవు. ఆర్కి టిక్‌.. అంటార్కిటికాలను ధృవాలు అం టాం. ఈ ప్రాంతాలను అసలు ధృవా లని పిలుస్తారు. అయస్కాంత క్షేత్ర ధృవాలు భూమి లోపలి పొరల్లో జరిగే కార్యకలాపాలకు అనుగు ణంగా కదులుతుంటాయి. ఇంకా సులువుగా చెప్పాలంటే 3 లక్షల ఏళ్లకోసారి ధృవాలు తారుమారు అవు తుంటాయి.

అయస్కాంతం తిరగబడి నట్లు అన్నమాట! కానీ ఈ మధ్య ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందట. ఎంత వేగంగా అంటే.. అయస్కాంత ఉత్తర ధృవం ఏడాదికి యాభై కిలోమీటర్ల చొప్పున సైబీరియా ప్రాంతంవైపు కదలిపోయేంతగా! అయితే ఏంటి అంటున్నారా.. దీని వల్ల చాలా సమ స్యలే ఉన్నాయి. గూగుల్‌ మ్యాప్స్‌ మొదలుకొని విమా నాలు, నౌకలు తమ ప్రయాణానికి ఉపయోగించే దిక్సూచీలన్నీ ఈ అయస్కాంత ధృవాల ఆధారంగానే ఉత్తర దక్షిణాలను గుర్తిస్తుంటాయి. ఒకవేళ ధృవాలు తారుమారైతే ఈ రంగాలన్నీ అతలాకుతలమైపోతాయి.

కారణమేంటో తెలీదు..

అయస్కాంత ధృవాలు ఎందుకు తారుమారు అవుతున్నా యన్న ప్రశ్నకు ఇప్పటివరకూ సమాధానం లేదు. అయస్కాంత ఉత్తర ధృవం ప్రస్తుతం కెనడా ప్రాంతంలో ఉన్నట్లు అంచనా. కంటికి కనిపించని ధృవాల కదలికలతో వరల్డ్‌ మాగ్నెటిక్‌ మోడల్‌ పేరుతో ఒక మ్యాప్‌ ఉంటుంది. గూగుల్‌ లాంటి సంస్థలు ఈ మోడల్‌నే వాడుకుంటాయి. 2020 వరకు పనిచేస్తుందన్న అంచనాతో నాలుగేళ్ల కింద తాజా మోడల్‌ విడుదలైంది. అయితే తాజా పరిశోధనలు మాత్రం ఈ మోడల్‌ను అర్జెంటుగా మార్చేయా లని సూచిస్తున్నాయి. ఐదేళ్ల కాలంలో కదిలే దూరాన్ని మూడేళ్లలోనే అధిగమించినట్లు కొలరాడో యూనివర్సిటీ, నేషనల్‌ ఓషియానిక్‌ అండ్‌ అట్మాస్ఫియరిక్‌ అడ్మినిస్టేషన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు.

2000 నుంచి అయస్కాంత ఉత్తర ధృవం ఏడాదికి 50 కిలోమీటర్ల దూరం కదులుతోందని.. అయితే మూడేళ్ల కింద సంభవించిన ఓ భౌగోళిక సంఘటన.. ఉత్తర ధృవ ప్రాంతంలోని అయస్కాంత క్షేత్రంలో వచ్చిన మార్పుల కారణంగా వేగం మరింత పెరిగిందని అర్నాడ్‌ చుల్లియట్‌ అనే శాస్త్రవేత్త వివరించారు. అయస్కాంత దక్షిణ ధృవం మాత్రం ఏడాదికి పది కిలోమీటర్ల మేర మాత్రమే కదులుతోందని చెప్పారు. దీంతో ఈ మోడల్‌ను అర్జెంటుగా మార్చేయాలని, లేదంటే యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీతో పాటు ఇతర సంస్థల నావిగేషన్‌ వ్యవస్థలు దెబ్బతింటాయని శాస్త్రవేత్తలు భావించారు. ఈ నెల 15 నాటికి మార్చేద్దామని నిర్ణయించారు కూడా. కాకపోతే అమెరికాలో ప్రభుత్వం షట్‌డౌన్‌ కారణంగా ఈ గడువు నెలాఖరుకు చేరింది.

ఏం జరుగుతుంది?

అయస్కాంత ఉత్తర ధృవం వేగంగా కదలిపోతే నావిగేషన్‌ వ్యవస్థలకు ఇబ్బందన్నది ఒక సమస్య మాత్రమే. ఇది కాస్తా సమీప భవిష్యత్తులో ధృవాలు తారుమారయ్యేం దుకు సూచిక అయితే ప్రమాదమేనని శాస్త్ర వేత్తల అంచనా. సూర్యుడి నుంచి వస్తున్న రేడి యోధార్మిక కిరణాల నుంచి మనల్ని రక్షిస్తున్న అయస్కాంత క్షేత్ర ధృవాలు తారుమారయ్యే సమ యంలో బలహీనంగా మారుతాయి. సూర్యుడి నుంచి వెలువడే శక్తిమంతమైన కిరణాలు మన ఉపగ్రహాలను, విద్యుత్‌ సరఫరా గ్రిడ్‌లను తీవ్రంగా నష్టపరుస్తాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోపక్క ఈ అయస్కాంత క్షేత్రం ఆధారంగానే ఎటువెళ్లాలో నిర్ణయించుకునే పక్షులు గందరగోళానికి గురవుతాయి. అయితే ఈ ధృవాల తారుమారు ప్రక్రి యతో ప్రాణ నష్టం ఉండే అవకాశాలు లేకపోవడం కొంచెం సాంత్వన కలిగించే అంశం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top