అంబరాన్నంటుతున్న న్యూ ఇయర్‌ వేడుకలు.. | New Year Celebrations In New Zealand And Australia | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటుతున్న న్యూ ఇయర్‌ వేడుకలు..

Dec 31 2019 8:05 PM | Updated on Dec 31 2019 8:07 PM

New Year Celebrations In New Zealand And Australia - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్‌ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రతి దేశం కూడా అక్కడి స్థానిక కాలమానం ప్రకారం కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతుందనే సంగతి తెలిసిందే. ముందుగా టోంగా, సమోవా, కిరిబాటి దీవుల్లో నూతన ఏడాది ప్రారంభమైంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలు కొత్త ఏడాదికి స్వాగతం పలికాయి. ఆక్లాండ్‌, సిడ్నీ ఇతర ముఖ్య నగరాల్లో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ ఘనంగా జరుగుతున్నాయి. రంగురంగుల ఫైర్‌ వర్క్స్‌ కనువిందు చేస్తున్నాయి. హ్యాపీ న్యూ ఇయర్‌ అంటూ పెద్దగా అరుస్తూ జనాలు న్యూ ఇయర్‌ స్వాగతం పలుకుతున్నారు. 

మరో కొన్ని గంటల్లో భారత ప్రజలు న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. దేశంలోని పలు పట్టణాల్లో న్యూ ఇయర్‌కు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. డీజేలు, డ్యాన్స్‌లతో హోరెత్తిస్తున్నారు. మరోవైపు పబ్‌లకు, రెస్టారెంట్లకు జనాలు క్యూ కడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement