పక్షి దెబ్బకు 14కోట్లు నష్టం

Navy E-6B Mercury doomsday plane hit by bird - Sakshi

మేరీల్యాండ్‌: ప్రచ్చన్న యుద్ధ కాలంలో అమెరికా నేతలకు రక్షణ కల్పించడంతోపాటు అణుదాడులకు ఉపయోగపడిన ఓ కీలకమైన విమానం పక్షి కారణంగా దెబ్బతినడంతో రూ.14 కోట్ల మేర నష్టం కలిగింది. మేరీల్యాండ్‌లోని పట్యుక్సెంట్‌ రివర్‌ నేవల్‌ ఎయిర్‌ స్టేషన్‌లో ఈ నెల 2న జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ–6బీ మెర్క్యురీ రకం విమానం రన్‌వేపైకి వస్తున్న క్రమంలో ఓ పక్షి ఢీకొంది. విమానాన్ని వెంటనే సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే, పక్షి కారణంగా విమానంలోని నాలుగు ఇంజిన్లలో ఒకటి దెబ్బతింది. దీంతో రూ.14 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనను వైమానిక దళం ‘ఏ క్లాస్‌’ ప్రమాదంగా పేర్కొంది. ఈ–6బీ మెర్క్యురీ విమానం ఖరీదు రూ.10వేల కోట్లపైమాటే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top