చీమలున్నాయని ఇంటికి నిప్పుపెట్టాడు..! | Sakshi
Sakshi News home page

చీమలున్నాయని ఇంటికి నిప్పుపెట్టాడు..!

Published Tue, Mar 21 2017 7:23 PM

చీమలున్నాయని ఇంటికి నిప్పుపెట్టాడు..! - Sakshi

న్యూయార్క్: ఇంట్లో చీమల బెడద భరించలేక ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం వికటించింది. చివరికి అతని ఇల్లే తగలబడిపోయింది. ఈ ఘటన న్యూయార్క్‌లోని మైన్‌ నగరంలోని ఓల్డ్‌ ఆర్చర్డ్‌ బీచ్‌ ప్రాంతంలో జరిగింది. డెవోన్‌ డౌసెట్‌ అనే వ్యక్తి తన తల్లిదండ్రుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే, ఆ ఇంటి బేస్‌మెంట్‌లో చీమలు పుట్టలు పెట్టాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని అక్కడి నుంచి తరిమేయడం సాధ్యం కాలేదు.

దీంతో శనివారం బేస్‌మెంట్‌ వద్ద ఉన్న చీమల పుట్ట చుట్టూ కొద్దిగా మంట పెట్టాడు. ఒక్కసారిగా ఎగిసిన మంటలు పక్కనే ఉన్న చెత్తకు అంటుకుని ఇంటి మొత్తానికి వ్యాపించాయి. ఆ సమయంలో ఒక్కడే ఉండటంతో ఇంట్లోని కొన్ని వస్తువులను బయటకు తెచ్చుకునేందుకు యత్నించి గాయపడ్డాడు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు డౌసెట్‌ను ఆసుపత్రికి తరలించారు.

కాగా, డౌసెట్‌ సోదరి తమకు సాయం చేయాలంటూ ఓ ఫండ్‌ వెబ్‌సైట్లో ఘటన వివరాలు పోస్టు చేయగా.. పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇప్పటివరకూ పది వేల డాలర్లు విరాళాల రూపంలో పొగయ్యాయి. డబ్బుతో పాటు ఆ కుటుంబానికి అవసరమయ్యే కొన్ని వస్తువులను కూడా కొందరు సమకూర్చారు.

Advertisement
 
Advertisement