రికార్డు చీర.. తెచ్చింది పెద్ద తంటా!

Longest saree gives legal issue for sri lanka couple

మండుటెండలో 250 మంది విద్యార్థినులు

విచారణ చేపట్టిన నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ అధారిటీ

కొలంబో: రికార్డు పొడవైన చీరను ధరించానని నవ వధువు మురిసిపోయింది. అంగరంగ వైభవంగా వివాహం జరిగిందని ఇరువురి కుటుంబసభ్యులు సంతోషంగా ఉన్నారు. అయితే ఆ రికార్డు చీరనే ఓ నవ దంపతులకు చిక్కులు తెచ్చి పెట్టింది. అయితే విద్యార్థినులు ఆ చీరను పట్టుకుని మండుటెండలో నిల్చోవడం చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు. దంపతులతో పాటు ఇందుకు కారకులైన కొందరిని  అధికారులు ప్రశ్నించనున్నారు.

శ్రీలంకలోని కాండీ జిల్లాలో జరిగిన వివాహం వివరాలిలా ఉన్నాయి.. కాండీలో గురువారం ఓ సెలబ్రిటీ జంట వివాహం ఘనంగా జరిగింది. అయితే నవ వధువు 3.2 కిలోమీటర్ల చీరను ధరించడంతో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే ఆ చీరను పట్టుకుని వధువుకు సాయం చేసేందుకు ఓ స్కూలుకు చెందిన 250 మంది విద్యార్థినులు మండుటెండలో ఉన్నారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది.

నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ అధారిటీ (ఎన్‌సీపీఏ) అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ఎన్‌సీపీఏ చైర్మన్ మారిని డే లివేరా మాట్లాడుతూ.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని, చిన్న పిల్లలు, విద్యార్థులను ఇలాంటి పనులకు వాడుకోవడం చాలా తప్పిదమన్నారు. విద్యార్థులను ఇలా కష్టాలకు గురిచేసే వారికి దాదాపు 10ఏళ్లు శిక్షకు గురవుతారని చెప్పారు. అయితే ఈ వివాహానికి ప్రత్యేక అతిథిగా హాజరైన సందర్భంగా సెంట్రల్ ప్రావిన్స్ సీఎం శరత్ ఎకనాయక మాట్లాడుతూ.. శ్రీలంకలో ఓ వధువు ధరించిన అతిపెద్ద చీర ఇదేనంటూ కితాబివ్వడం విమర్శలకు కేంద్ర బిందువైంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top