
నేరుగా గుండెలోకి కత్తి దించి..
నిత్యం భయానకం, అంచనా వేయలేని నరమేధం.. ఏమాత్రం మానవత్వ ఛాయలు లేకుండా వ్యవహరించే తీరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల సొంతం. అలాంటి ఉగ్రవాదులు చంపడంలో నిత్యం ప్రయోగాలు చేస్తున్నారు.
రక్బా: నిత్యం భయానకం, అంచనా వేయలేని నరమేధం.. ఏమాత్రం మానవత్వ ఛాయలు లేకుండా వ్యవహరించే తీరు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల సొంతం. అలాంటి ఉగ్రవాదులు చంపడంలో నిత్యం ప్రయోగాలు చేస్తున్నారు. తమ మూర్ఖపు సిద్ధాంతాలకు, కట్టుబాట్లకు వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తినా వారిని అరెస్టు చేయడం ఒక ఎత్తయితే.. అలా అరెస్టు చేసిన వారిని నడి బజార్లోకి తీసుకొచ్చి చంపడం మరో ఎత్తు. వారు ఓ వ్యక్తిని బహిరంగంగా హత్య చేయడంలో ఒక్కో సమయంలో ఒక్కో విధానం అనుసరిస్తున్నారు.
ఇప్పటి వరకు బహిరంగంగా ఉరి తీయడమో రాళ్లతో కొట్టిచ్చి చంపడమో లేక.. బాంబును అమర్చి పేల్చేయడమో లాంటివి చేసే ఉగ్రవాదులు ఇప్పుడు మరో కొత్త పంథాను ప్రారంభించారు. నేరుగా కత్తిని గుండెల్లోకి చుట్టూ జనాలు చూస్తుండగా దింపుతున్నారు. ఆ కత్తి అలా ఉంచే తలకు తుపాకీని ఆనిచ్చి ఫట్ మని కాల్చేస్తున్నారు. రక్బా ప్రాంతంలో వైమానిక దాడులు జరుపుతున్న అమెరికా వాయు సేనలకు పరోక్షంగా సహకరిస్తున్నాడనే కారణంతో అబ్దుల్ హాదీ ఎస్సా అల్ సాలెం అనే వ్యక్తిని తొలుత అరెస్టు చేసిన ఉగ్రవాదులు.. అతడిని నడి రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి మరణ శిక్ష వేశారు.
ఇతడిపైనే కొత్త పద్ధతిలో హత్యను ప్రయోగించారు. చుట్టుపక్కల వారిని పిలుచుకొచ్చి అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై కూర్చొబెట్టి కళ్లకు గంతలు కట్టి మొనదేలిన కత్తితో గట్టిగా అదిమిపట్టి నేరుగా గుండెలోకి దించారు. ఆ బాధకే అతడు గిలగిలా తన్నుకుంటుంగా మళ్లీ కూర్చొబెట్టి తలకు తుపాకీ అనిచ్చి పుచ్చకాయలాగా పేల్చేసి అతడి మృతదేహాన్ని రోడ్డు డివైడర్ కు హెచ్చరికగా అమర్చారు. ఈ వీడియోను ఫొటోలను కొందరు ఆన్ లైన్ లో పెట్టగా ప్రపంచం ఇప్పుడు నివ్వెర బోతోంది.