'నా డ్రెస్సింగ్తో సంతృప్తిగానే ఉన్నా' | I feel comfortable in what I wear says Rita Ora | Sakshi
Sakshi News home page

'నా డ్రెస్సింగ్తో సంతృప్తిగానే ఉన్నా'

Dec 10 2015 9:04 AM | Updated on Sep 3 2017 1:47 PM

'నా డ్రెస్సింగ్తో సంతృప్తిగానే ఉన్నా'

'నా డ్రెస్సింగ్తో సంతృప్తిగానే ఉన్నా'

బ్రిటన్ సింగర్, నటి రీటా ఓరా డ్రెస్సింగ్ ఎప్పుడూ సంచలనమే. డ్రెస్సింగ్ విషయంలో ఆమెకు ఆమే సాటి.

లండన్: బ్రిటన్ సింగర్, నటి రీటా ఓరా డ్రెస్సింగ్ ఎప్పుడూ సంచలనమే. డ్రెస్సింగ్ విషయంలో ఆమెకు ఆమే సాటి. రీటా వాడే డిజైన్లు కొత్త ట్రెండ్ను సృష్టిస్తూ అభిమానులను చూపు తీప్పుకోకుండా చేస్తాయి. అయితే కొన్నిసార్లు రీటా అనుకోకుండానే అభిమానులకు తన అందాలతో కనువిందు చేస్తుంటారు. అదెలాగంటే  చాలా కార్యక్రమాల్లో ఆమె ధరించిన వస్త్రాలు.. యాక్సిడెంటల్గా ఊడిపోయి ఆమెకు హ్యాండ్ ఇచ్చాయి. రీటా డ్రెస్సింగ్ చాలా రిస్క్తో కూడుకున్నదని డిజైనర్లు చెబుతుంటారు.

దీనిపై రీటా మాట్లాడుతూ ' ఇది చాలా సరదాగా ఉంటుంది. నేను ధరించే వస్త్రాల పట్ల సంతృప్తిగానే ఉన్నాను. అనుకోకుండా చాలాసార్లు అలా జరిగినంత మాత్రాన నేను ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. నలుగురిలో నేను చాలా ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటాను. ఫ్యాషన్లో రిస్క్ తీసుకోవడం అవసరం కూడా' అని చెబుతోంది. పైగా అలా రిస్క్ తీసుకున్నందుకు గర్వంగా ఫీలవుతుంటానని తెలిపింది. అయితే మరోసారి  అందాల తార అందాలను చూసే అవకాశం ఉంటుందేమోనని అభిమానులు కూడా రీటా ప్రకటనపై లోలోపల సంతోషంగానే ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement