భాగ్యనగరం.. బెస్ట్.. | hyderabad in the best | Sakshi
Sakshi News home page

భాగ్యనగరం.. బెస్ట్..

Nov 28 2014 2:52 AM | Updated on Sep 2 2017 5:14 PM

భాగ్యనగరం.. బెస్ట్..

భాగ్యనగరం.. బెస్ట్..

ఈ మాట మేమంటున్నది కాదు.. స్వయంగా నేషనల్ జియోగ్రఫిక్ ట్రావెలర్ మేగజైనే పేర్కొంది.

ఈ మాట మేమంటున్నది కాదు.. స్వయంగా నేషనల్ జియోగ్రఫిక్ ట్రావెలర్ మేగజైనే పేర్కొంది. 2015లో ప్రపంచ పర్యాటకులు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాల జాబితాలో మన హైదరాబాద్‌కూ చోటు కల్పించింది. ‘బెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ పేరిట నేషనల్ జియోగ్రఫిక్ ఎంపిక చేసిన 20 ప్రదేశాల జాబితాలో మన భాగ్యనగరమూ ఉంది.

భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం మనదే కావడం విశేషం. ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్ అత్యద్భుతమైన ఆధ్యాత్మిక, చారిత్రక కట్టడాలకు, రాజభవనాలకు నెలవు అని పేర్కొంది.

అదే సమయంలో ఈ మొత్తం 20 ప్రదేశాల్లో తన ఫేవరెట్లుగా పేర్కొంటూ బ్రిటన్‌కు చెందిన డెయిలీ మెయిల్ పత్రిక టాప్-7 పేరిట ఓ జాబితాను ప్రచురించింది. అందులోనూ మన నగరానికి(7వ స్థానం) చోటు దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement