
మెక్సికోలో దారుణం
ఒకే కుటుంబంలోని 11 మందిని కాల్చి చంపిన ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది.
మెక్సికో: ఒకే కుటుంబంలోని 11 మందిని కాల్చి చంపిన ఘటన మెక్సికోలో చోటు చేసుకుంది. నిందితుల్లో ఓ వ్యక్తి ఆ కుటుంబంలోని ఓ మహిళను రేప్ చేశాడని, దాని వల్ల ఆమె ఓ శిశువుకు కూడా జన్మనిచ్చిందని పోలీసులు తెలిపారు.
చనిపోయిన వారిలో నలుగురు పురుషులు, ఐదుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. గాయపడ్డ ఇద్దరు చిన్నారులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హంతకులు ఆ గ్రామానికి కాలినడకన వచ్చి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అధికారులు వారిలో ఇద్దరిని గుర్తించారు. కానీ అప్పటికే వారు పక్కనే ఉన్న కొండల ద్వారా ఓక్సాకా రాష్ట్రానికి పారిపోయారు. దీనికి పూర్తిగా వ్యక్తిగత కారణాలే కారణమని అధికారులు చెబుతున్నారు. పంచనామా కోసం వీరి శరీరాలను టెచువాన్ నగరానికి తరలించారు.