హఫీజ్‌ సయీద్‌ హత్యకు కుట్ర..!

Foreign intelligence agency plans to kill Hafiz Saeed: Pakistan - Sakshi

లాహోర్‌ : ముంబై దాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ హత్యకు కుట్ర జరగుతోందని పాకిస్తాన్‌ ఆరోపించింది. ఓ విదేశీ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ సయీద్‌ను అంతమొందించేందుకు పక్కా వ్యూహాన్ని సిద్ధం చేసిందని, ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అతనికి భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని పంజాబ్‌ హోం డిపార్ట్‌మెంట్‌కు లేఖ రాసింది. 

సయీద్‌ హత్యకు ఓ నిషేధిత సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఫారిన్‌ ఇంటిలిజెన్స్‌ రూ.8 కోట్లు చెల్లించినట్లు పాకిస్తాన్‌ జాతీయ కౌంటర్‌ టెర్రరిజమ్‌ అథారిటీ లేఖలో పేర్కొంది. సయీద్‌ ఈ ఏడాది జనవరి నుంచి లహోర్‌లో హౌస్‌ అరెస్టుగా ఉన్న విషయం తెలిసిందే. 

సయీద్‌కు చెందిన జమాత్‌ ఉద్‌ దవా(జేయూడీ)ని అమెరికా 2014లోనే విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్న సయీద్‌పై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల క్యాష్‌ ప్రైజ్‌ను కూడా ప్రకటించింది.
 

Back to Top