టాప్ హనీమూన్ లొకేషన్లు..
సమయం దొరికినప్పుడల్లా, ఉల్లాసంగా గడపాలనుకున్న పర్యాటకుల కోసం రోజు రోజుకూ ఆధునిక పద్దతులతో కాంక్రీటు నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి.
సమయం దొరికినప్పుడల్లా, ఉల్లాసంగా గడపాలనుకున్న పర్యాటకుల కోసం రోజు రోజుకూ ఆధునిక పద్దతులతో కాంక్రీటు నిర్మాణాలు వెలుస్తూనే ఉన్నాయి. అద్భుతమైన ఆర్కిటెక్ట్ పరిజ్ఞానంతో ఎత్తైన ఆకాశహర్మ్యాలు నిర్మించినా, ప్రకృతికి దూరంగా వెలుతున్నామన్న భావన మాత్రం పర్యటకుల్లో కలుగుతోంది. ఇలాంటివారి కోసమే సకల సదుపాయాలతో ప్రకృతి రమణీయత నడుమ,సహజ వనరులతో నిర్మించిన కట్టడాలకు యమగిరాకీ ఉంటోంది. ఉష్ణమండల శీతోష్ణ వాతావరణంలో ముఖ్యంగా హనీమూన్ లోకేషన్లుగా పేరొందిన ఐదు నిర్మాణాల గురించి తెలుసుకుందాం.
సీక్రెట్ బే , డొమినికా
ఎత్తైన కొండలపై ఎటు చూసినా పచ్చదనం మధ్య మొత్తం నాలుగు విల్లాలు అద్భుతమైన లోకేషన్లలో ఉన్నాయి. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా వీటిని నిర్మించారు. సహజసిద్దమైన జలపాతాల పక్కనే నిర్మించిన ఈ విల్లాలు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తొన్నాయి. దీంతో నవంబర్కు గానూ ఆన్లైన్ బుకింగ్స్లో ట్రీ హౌస్ కేటగిరీలో అత్యంత ఖరీదైన విల్లాల సరసన సీక్రెట్ బే నిలిచింది.
ప్లయా వివా, జులుచుకా, మెక్సికో...
అద్భుతమైన ఆర్కిటెక్ట్ నైపుణ్యంతో వీటిని నిర్మించారు. సముద్రానికి ఆమడ దూరంలో కొబ్బరి చెట్ల నడుమ వీటిని నిర్మించారు. గుండ్రటి ఆకారంలో వెదురు బొంగుల నిర్మాణాన్ని కొబ్బరి చెట్ల సహాయంతో నిర్మించిన గదులు ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి. ఇక్కడి రూమ్లను బుక్ చేసుకోవాలంటే నెలల తరబడి వెయిట్ చేయాల్సిందే. దీంతో వీటి యజమానులు డిమాండ్కు తగ్గట్టుగా మరిన్ని నిర్మాణాలను చేపట్టే పనిలో ఉన్నారు.
ఎక్రె, సాన్ జోస్ డెట్ కబో, మెక్సికో
ఏడాది కింద సాధారణ ఫామ్గా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు 12 ట్రీ హౌస్లతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. 12 కర్ర చెక్కకర్రలతో చతురస్రాకారంలో వీటిని నిర్మించారు. సైజులో కొద్దిగా చిన్నగా ఉన్నా, అన్ని సౌకర్యాలను అందులోనే కల్పించారు.
పప్పాయా ప్లాయా, తులుం, మెక్సికో
పురాతన మాయన్ సంస్కృతి ఉట్టిపడేలా గోళాకారంలో వీటిని నిర్మించారు. సముద్రానికి దగ్గర్లో ఆహ్లాదమైన వాతావరణంలో చెట్ల నడుమ ఉన్నపప్పాయా ప్లాయా పర్యాటకులను ఓ అద్భతమైన అనుభూతిని ఇస్తోంది.
హోషినోయా, బాలీ, ఇండోనేషియా
కిందనుంచి నీటి ప్రవాహాలతో జల స్వర్గాన్ని తలపించే హోషినోయా ఆక్వాటిక్ పారడైజ్ ఓ అద్భుతమైన నిర్మాణం. వీటి పై భాగంలో కేఫే, ఓపెన్ రూంలు ఉంటాయి. హోషినోయాకు 102 ఏళ్ల చరిత్ర ఉంది.


