అవన్నీ నకిలీ వార్తలు: ట్రంప్‌ ఆగ్రహం | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యమే కొంపముంచింది.. ట్రంప్‌ ఫైర్‌!

Published Mon, Apr 13 2020 1:33 PM

Donald Trump Slams New York Times Over Covid 19 Response Story - Sakshi

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19) గురించి నిఘా వర్గాలు ముందే హెచ్చరించినా తాను నిర్లక్ష్యంగా వ్యహరించానంటూ న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన కథనంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మండిపడ్డారు. ‘‘న్యూయార్క్‌టైమ్స్‌ కథనం నకిలీది. అదొక కాగితం మాత్రమే. చైనా ప్రయాణాలపై అందరికంటే ముందే నిషేధం విధించి నేను విమర్శలు ఎదుర్కొన్నాను. అలెక్స్‌ అజర్‌(అమెరికా హెల్త్‌ అండ్‌ హ్యూమన్‌ సర్వీసెస్‌ కార్యదర్శి) అంతవరకు నాకేమీ చెప్పలేదు. పీటర్‌ నెవారో కూడా అలాగే మాట్లాడారు. నకిలీ వార్తలు!’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.(కరోనా మృతులు న్యూయార్క్‌లోనే ఎందుకు ఎక్కువ?)

కాగా ట్రంప్‌ ఏకపక్ష నిర్ణయాల వల్లే అమెరికాలో కరోనా విజృంభిస్తోందని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం ప్రచురించింది. ఆరోగ్య శాఖ, జాతీయ దర్యాప్తు సంస్థ, నిఘా వర్గాలు ప్రాణాంతక వైరస్‌ గురించి హెచ్చరించినా ట్రంప్‌ పట్టించుకోలేదని ఆరోపించింది. ఆయన నిర్లక్ష్యంగానే మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 21 వేల మంది కరోనాకు బలికాగా.. ఐదున్నర లక్షల మంది దీని బారిన పడ్డారు. ఇక చైనాలో తొలిసారిగా కరోనా ఆనవాళ్లు బయటపడినప్పటికీ దాని గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయకుండా ఆ దేశం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించాయంటూ ట్రంప్‌ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అదే విధంగా మహమ్మారి తీవ్రతను తెలియజేయకుండా ఇంతటి సంక్షోభానికి కారణమైను చైనాకు వత్తాసు పలుకుతున్న డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు ఆపివేస్తామంటూ ఆయన హెచ్చరించారు.(డబ్ల్యూహెచ్‌ఓకు నిధులు నిలిపివేస్తాం: ట్రంప్‌)

మీరెవరో మీకైనా తెలుసా: ప్రధానిపై ఫైర్‌!

Advertisement
Advertisement