ఎడారిలో జలవృక్షం.. | China designers specially designed `Hope tree` for Desert region residents | Sakshi
Sakshi News home page

ఎడారిలో జలవృక్షం..

Aug 23 2014 12:28 AM | Updated on Sep 2 2017 12:17 PM

ఎడారిలో జలవృక్షం..

ఎడారిలో జలవృక్షం..

మండుటెండలకు తోడు మంచినీటికీ కరువును ఎదుర్కొనే ఆఫ్రికా, ఇతర ఎడారి ప్రాంత వాసుల కోసం చైనా డిజైనర్లు రూపొందించిన ‘హోప్ ట్రీ’ డిజైన్ ఇది.

మండుటెండలకు తోడు మంచినీటికీ కరువును ఎదుర్కొనే ఆఫ్రికా, ఇతర ఎడారి ప్రాంత వాసుల కోసం చైనా డిజైనర్లు రూపొందించిన ‘హోప్ ట్రీ’ డిజైన్ ఇది. ఆరుబయట పెద్ద చెట్టు మాదిరిగా ఏర్పాటుచేసే హోప్ ట్రీ టవర్ పైభాగం గాలిలోని తేమను ఒడిసిపడుతుంది. తర్వాత తేమలోని నీటి అణువులు కాండంలోకి చేరతాయి. అక్కడ నీరు శుభ్రపడి స్వచ్ఛమైన తాగునీటిగా కిందికి చేరుతుంది. ఇంకేం.. అక్కడి నుంచి బిందెలతో తీసుకెళ్లడమే. అన్నట్టూ.. మంచినీటికి తీవ్ర కరువు ఉన్న ప్రాంతాల్లో గాలిలో తేమ నుంచి మంచినీటి తయారీ కోసం కొందరు శాస్త్రవేత్తలు ఇదివరకే ఇలాంటి కొన్ని డిజైన్లను ఆవిష్కరించగా.. మరింత సులభం, చౌక అయిన పద్ధతుల కోసం మరికొందరు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement