న్యూజిలాండ్‌లో కాల్పులు.. బంగ్లా క్రికెటర్లు సురక్షితం

Bangladesh Cricketers Escape from Mosque Shooting in Christchurch - Sakshi

వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌, క్రిస్ట్‌చర్చ్‌ సెంట్రల్‌ సిటీలోని హగ్లీపార్క్‌ మజీదులో దుండగులు శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. హగ్లీపార్క్‌లో సమీపంలోని రెండు మజీదులపై ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడ్డారని, దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనతో రెండు మజీదులు రక్తసిక్తమయ్యాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనాలు పరుగు పేట్టారని తెలిపింది. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. క్రిస్ట్‌చర్చ్‌ సిటీలోని ప్రజలెవరు బయటకు రావద్దని సూచించారు. మృతుల సంఖ్యను అధికారికంగా ప్రకటించినప్పటికి ప్రాణనష్టం ఎక్కువగానే ఉందని తెలుస్తోంది.  

ఇక ప్రస్తుతం ఆ దేశ పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు ఈ కాల్పుల ఘటన నుంచి సురక్షితంగా బయటపడింది. శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌కు సమయాత్తం అవుతున్న.. బంగ్లా ఆటగాళ్లు ప్రార్థనల కోసం మజీదుకు వెళ్లగా.. ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. కాల్పుల శబ్దం విన్న ఆటగాళ్లు పరుగులు తీశారు.  ఈ కాల్పులు నుంచి బంగ్లా ఆటగాళ్లు సురక్షితంగా బయటపడ్డారని ఆ జట్టు ఆటగాడు తమీమ్‌ ఇక్బాల్‌ ట్వీట్‌ చేశాడు. ఈ కాల్పుల ఘటన జరిగిన సమీపంలోనే తమ ఆటగాళ్లు ఉన్నారని, కానీ  ఆ దేవుడి దయ వల్ల ఎలాంటి నష్టం జరగలేదని బంగ్లాదేశ్‌ కోచ్‌ మీడియాకు తెలిపాడు. ఈ ఘటనతో ఆటగాళ్లు వణికిపోయారన్నాడు. ఆ అల్లానే తమని రక్షించారని ముష్పికర్‌ రహీమ్‌ ట్వీట్‌ చేశాడు. తాము చాలా అదృష్టవంతులమని, జీవితంలో మళ్లీ ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడదల్చుకోలేమని పేర్కొన్నాడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top