‘బేబీ యోధ’ కావాలంటే 17 నెలలు ఆగాల్సిందే..!

Baby Yoda Toy At Rs 21 Thousand But Still Wait For 17 Months - Sakshi

ముంబై : మన దేశంలో ఓ వస్తువు మార్కెట్లోకి విడుదలవకముందే దాన్ని పోలిన డూప్లికేట్‌ వచ్చేస్తుంది. బ్లాక్‌ మార్కెట్‌ పుణ్యమాని అసలు ఉత్పత్తిదారుడు ఢీలా పడిపోతాడు. కానీ, పాశ్చాత్య దేశాల్లో అలా కాదు. అసలైన వస్తువుకే ప్రజలు పట్టం కడతారు. కోరుకున్న ఆ వస్తువు కోసం ఎన్ని నెలలైనా వేచి చూస్తారు. ‘బేబీ యోధ’ బొమ్మల విషయంలో ఇది మరోసారి వెల్లడైంది. డిస్నీ వారి విజయవంతమైన కార్యక్రమం ‘ద మండలోరిన్‌’ లోనిదే ఈ బేబీ యోధ క్యారెక్టర్‌. ‘ద మండలోరియన్‌’లోని యాబై ఏళ్ల వింతైన బేబీ యోధ బొమ్మలను గాక్‌మన్‌ క్రియేచర్స్‌( ఎట్సీ) అనే సంస్థ తయారు చేస్తోంది.

టినీ మాస్టర్‌గా పిలుస్తున్న ఈ బొమ్మను నక్క బొచ్చు, పాలిమర్ మట్టి, పాస్టెల్స్‌తో తయారు చేస్తారు. ఐదు అంగుళాల పొడవు, గాజు అద్దాలున్న బేబీ యోధ వార్తల్లో నిలవడానికి కారణం దానికున్న విపరీతమైన క్రేజే. ఈ బొమ్మ ఖరీదు అక్షరాల రూ.21 వేలు కావడం ఒక విశేషమైతే. షిప్పింగ్‌ చార్జీల కోసం మరో 2500 రూపాయలు చెల్లించాల్సిందే. ఇక ధర మాట అటుంచితే.. ఈ బొమ్మ మన చేతికి రావాలంటే 14 నుంచి 17 నెలలు ఆగాల్సిందే. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఇప్పుడు బుక్‌ చేసుకుంటే బేబీ యోధ మన చేతికి రావడానికి యేడాదిన్నర పడుతుంది. ఇక బేబీ యోధకు సంబంధించిన ఎమోజీని అందుబాటులోకి తేవాలని యూజర్లు యాపిల్‌ సంస్థకు విన్నవించడం మరో విశేషం.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top