కరాచీ మ్యూజియంలో అభినందన్ బొమ్మ

ఇస్లామాబాద్ : బాలాకోట్ వైమానిక దాడి అనంతరం జరిగిన పరిణామాల్లో పాక్ యుద్ధ విమానాలను తరుముకుంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పట్టుబడిన వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ బొమ్మను పాకిస్తాన్ వైమానిక దళ కేంద్ర స్థానమైన కరాచీలోని మ్యూజియంలో పెట్టుకున్నారు. ఈ విషయాన్ని పాక్ జర్నలిస్టు అన్వర్ లోధీ శనివారం అర్ధరాత్రి తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అభినందన్ బొమ్మ పెట్టడం గమనార్హం. అయితే బొమ్మను ఏ ఉద్దేశ్యంతో పెట్టారో అన్వర్ వెల్లడించలేదు. అంతేకాక, అభినందన్ బొమ్మ చేతిలో టీ కప్పు పెడితే ఇంకా బాగుండేదని సరదాగా వ్యాఖ్యానించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి