మయన్మార్‌లో గని వద్ద ఘోర ప్రమాదం 

162 Members Died Due To Landslide At Myanmar - Sakshi

162 మంది కూలీల సజీవసమాధి

యాంగూన్‌: మయన్మార్‌లోని ఓ గనివద్ద మట్టి కుప్పలు విరిగిపడిన ఘటనలో 162 మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని స్థానికులు అంటున్నారు. కచిన్‌ రాష్ట్రం హపకంట్‌ సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద పచ్చరాయి (జేడ్‌) గని ఉంది. ఈ గని నుంచి భారీ యంత్రాలతో తవ్వి తీసిన మట్టిని ఆ పక్కనే పోస్తుంటారు. కార్మికులు అక్కడే తాత్కాలిక నివాసాల్లో ఉంటున్నారు. కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆ మట్టిగుట్ట కార్మికుల నివాసాలపై పడటంతో ఈ ఘోరం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు 162 మృతదేహాలను వెలికితీసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2015లో ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనలో 113 మంది మృత్యువాత పడ్డారు. అక్రమంగా జరిగే జేడ్‌ గనుల తవ్వకాలతో మాజీ సైనిక పాలకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top