జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం | youth injured in road accident in jubilee hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం

Jul 29 2016 8:20 AM | Updated on Sep 18 2019 3:26 PM

నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారులు గుంతలమయమయ్యాయి.

హైదరాబాద్: నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రహదారులు గుంతలమయమయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని తాజ్‌మహల్ హోటల్ సమీపంలో రహదారిపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతలు గమనించని ఓ ద్విచక్రవాహన దారుడు శుక్రవారం ఉదయం అదుపుతప్పి కింద పడ్డాడు.

ఈ ప్రమాదంలో సదరు యువకుడి తలకు తీవ్రంగా గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని అంబులెన్స్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement