ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలోని హుసేన్ సాగర్ జలాశయం నీటిమట్టం పెరిగింది.
హుసేన్ సాగర్‌లో పెరిగిన నీటిమట‍్టం
Jul 18 2017 1:10 PM | Updated on Sep 5 2017 4:19 PM
హైదరాబాద్: ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలోని హుసేన్ సాగర్ జలాశయం నీటిమట్టం పెరిగింది. హూస్సేన్ సాగర్‌లోకి ఇన్ ఫ్లో 1200 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 300 క్యూసెక్కులు ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి హుసేన్ సాగర్ లోకి వర‍్షపు నీరు ఎక్కువగా చేరుతోంది. హుసేన్ సాగర్ తూము గేట‍్లను ఇరిగేషన్ అధికారులు ఎత్తివేశారు.
రోజంతా జల్లులు పడుతుండగా అప్పుడప్పుడు భారీ వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో రహదారులు పాక్షికంగా దెబ‍్బతిన్నాయి. అబిడ్స్, జూబ్లిహిల్స్ వంటి పలుచోట్ల రోడ‍్లపై చెట్లు విరిగిపడ్డాయి. మలక్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్ తదితర రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ కూడా స్తంభించింది.
Advertisement
Advertisement