హైదరాబాద్ నగరంలో టర్కీ కరెన్సీ చలామణి చేస్తున్న వ్యక్తిని ముషీరాబాద్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో టర్కీ కరెన్సీ చలామణి చేస్తున్న వ్యక్తిని ముషీరాబాద్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 97 టర్కీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని ముషీరాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.