దేవీప్రసాద్‌ను నిలపండి | tngo requist to trs party, on medak loksabha candidate | Sakshi
Sakshi News home page

దేవీప్రసాద్‌ను నిలపండి

Aug 19 2014 1:23 AM | Updated on Oct 9 2018 5:54 PM

దేవీప్రసాద్‌ను నిలపండి - Sakshi

దేవీప్రసాద్‌ను నిలపండి

మెదక్ లోక్‌సభ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా తమ అధ్యక్షుడు జి. దేవీప్రసాదరావును పోటీ చేయించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ (టీఎన్‌జీఓస్) రాష్ట్ర కార్యవర్గం సోమవారం నాడిక్కడ ఏకగ్రీవంగా తీర్మానించింది.

టీఆర్‌ఎస్‌కు టీఎన్‌జీఓ కార్యవర్గం విజ్ఞప్తి.. ఏకగ్రీవ తీర్మానం
కారుణ్య నియామకాలు, పదోన్నతులపై నిషేధం వద్దు

 
సాక్షి, హైదరాబాద్: మెదక్ లోక్‌సభ స్థానానికి ఎంపీ అభ్యర్థిగా తమ అధ్యక్షుడు జి. దేవీప్రసాదరావును పోటీ చేయించాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ (టీఎన్‌జీఓస్) రాష్ట్ర కార్యవర్గం సోమవారం నాడిక్కడ ఏకగ్రీవంగా తీర్మానించింది. తెలంగాణ ఉద్యమంలో కీలక భాగస్వామి అయిన దేవీప్రసాద్‌కు టీఆర్‌ఎస్ తరపున టికెట్ ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేసింది. నాం పల్లి టీఎన్‌జీఓ భవన్‌లో సంఘం రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం జరిగింది. దేవీ ప్రసాద్ పోటీ, జిల్లా స్థాయిలో కారుణ్య నియామకాలు, పదోన్నతులు, సమగ్ర సర్వేపై ఈ సమావేశంలో చర్చించి పలు తీర్మానాలు చేశారు.
 
దేవీప్రసాద్‌కు టికెట్ ఇవ్వాలంటూ పది జిల్లాల కార్యవర్గాలు చేసిన ఏకగ్రీవ తీర్మానాలను కేంద్ర సంఘానికి అందజేశారు. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా ఉద్యోగులు అందరినీ గౌరవిం చి న ట్టు అవుతుందన్నారు.  కారు ణ్య నియామకాలు, పదోన్నతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  ప్రభుత్వం చేపట్టిన ‘మన రాష్ట్రం - మన ప్రణాళిక’ కార్యక్రమంలో, సమగ్రసర్వేలో పని గంటలతో సంబంధం లేకుండా పనిచేయాలని తీర్మానించింది.  సర్వేను విజయవంతం చేయాలని ప్రజలను కోరింది. సమావేశంలో టీఎన్‌జీఓస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రవీందర్‌రెడ్డి, గంగారం, అశోక్, ముజీబ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement