రాంరెడ్డి వెంకటరెడ్డికి తుమ్మల పరామర్శ | Thummala Nageswara rao to visit KIMS due to ram reddy venkat reddy | Sakshi
Sakshi News home page

రాంరెడ్డి వెంకటరెడ్డికి తుమ్మల పరామర్శ

Feb 20 2016 12:08 PM | Updated on Sep 3 2017 6:03 PM

రాంరెడ్డి వెంకటరెడ్డికి తుమ్మల పరామర్శ

రాంరెడ్డి వెంకటరెడ్డికి తుమ్మల పరామర్శ

తీవ్ర అనారోగ్యానికి గురైన ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్రెడ్డిని తెలంగాణ రోడ్డు భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.

హైదరాబాద్ : తీవ్ర అనారోగ్యానికి గురైన ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్రెడ్డిని తెలంగాణ రోడ్డు భవనాల శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. శనివారం నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాంరెడ్డి వెంకట్రెడ్డిని తుమ్మల పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని  స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

అలాగే ఆసుపత్రి వైద్యులతో కూడా వెంకట్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై తుమ్మల వాకబు చేశారు. వెంకట్రెడ్డి తొందరగా కోలుకోవాలంటూ తుమ్మల ఆకాంక్షించారు. రాంరెడ్డి వెంకటరెడ్డి గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. నేపథ్యంలో ఆయన ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైయ్యారు. దీంతో ఆయన్ని కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement