ముస్లింలను మోసగించేందుకే ఎత్తుగడ | TDP propaganda on ysrcp | Sakshi
Sakshi News home page

ముస్లింలను మోసగించేందుకే ఎత్తుగడ

Aug 22 2017 1:21 AM | Updated on Aug 10 2018 8:27 PM

ముస్లింలను మోసగించేందుకే ఎత్తుగడ - Sakshi

ముస్లింలను మోసగించేందుకే ఎత్తుగడ

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ భాగస్వామి కాబోతోందంటూ టీడీపీ వర్గాలు ప్రచారం

- ఎన్డీఏలో వైఎస్సార్‌సీపీ చేరుతోందని టీడీపీ దుష్ప్రచారం
- వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ధ్వజం
 
సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ భాగస్వామి కాబోతోందంటూ టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నవి కేవలం గాలి వార్తలని, అమాయక ముస్లింలను మోసగించడానికే ఇలాంటి నీచపు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రచారాన్ని తీవ్రంగా తిప్పి కొడుతూ బీజేపీతో జత కలిసింది వారు (టీడీపీ).. కేంద్రంలో భాగస్వాములైంది వారు (టీడీపీ) ఇదంతా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నదే అయినా ఎదుటి వారిపై నిందలేయడం విడ్డూరమని విస్మయం వ్యక్తం చేశారు.

ఈ మేరకు సోమవారం రాత్రి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో ముస్లిం ఓటర్లు టీడీపీకి వ్యతిరేకంగా ఓటేయబోతున్నారని గ్రహించి.. వారిని తప్పు దోవ పట్టించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు.తాము బీజేపీతో ఉంటూ ఆ సంబంధాలను వైఎస్సార్‌సీపీకి ఆపాదించడం  లజ్జాకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement