
'చంద్రబాబు ఆరోగ్యానికి అదే మంచిది'
టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...హైదరాబాద్కు దూరంగా ఉండటం ఆయన ఆరోగ్యానికి మంచిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...హైదరాబాద్కు దూరంగా ఉండటం ఆయన ఆరోగ్యానికి మంచిదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన మంగళవారం అసెంబ్లీ లాబీలో విలేకరులతో చిట్చాట్ చేశారు. 'లోకేష్ ఆస్తుల ప్రకటన వింతగా ఉంది. చంద్రబాబు తల్లీదండ్రుల పరిస్థితి ఏంటో...ఆ తర్వాత చంద్రబాబు ఆస్తుల సంగతేంటో అందరికీ తెలుసు. నేను పార్టీ మారడంపై అంతగా మాట్లాడేవారు. ఏపీలో జరుగుతున్నదానిపై మాట్లాడరా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినవారికి పార్లమెంట్ పక్కనే చంద్రబాబు టీడీపీ కండువా కప్పారు. సనత్నగర్ ఉప ఎన్నిక గురించి దిగులే లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్లో జనాభా కంటే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఓటర్ల తొలగింపుపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతమే. నా కుమారుడి రాజకీయ భవిష్యత్పై ఎక్కడా మాట్లాడలేదు. తెలంగాణ అభివృద్ధే కేసీఆర్ లక్ష్యం. జంట నగరాల అభివృద్ధికి సీఎం కట్టబుడి ఉన్నారు. రాబోయే మూడేళ్లలో అద్భుతాలు చూస్తారు' అని చెప్పుకొచ్చారు.