
ప్రభుత్వ వెబ్ సైట్ లో హీరోయిన్ నగ్నఫొటో
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ ఎంసీ) అధికారిక వెబ్ సైట్ లో బాలీవుడ్ హీరోయిన్ ఫొటో కలకలం రేపింది.
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ ఎంసీ) అధికారిక వెబ్ సైట్ లో బాలీవుడ్ హీరోయిన్ ఫొటో కలకలం రేపింది. శృంగార తార సన్నీలియోన్ నగ్నచిత్రం ప్రత్యక్షం కావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. చెత్తను తరలించేందుకు ఉపయోగించే వాహనాల రాకపోకలను గమనించేందుకు జీహెచ్ ఎంసీ వెబ్ సైట్ లో ఉద్దేశించిన పేజీ(ఓఎస్ ఆర్టీ ఆప్షన్)లో సన్నీ లియోన్ ఫొటో కనబడింది.
జీహెచ్ ఎంసీ అధికారిక వెబ్ సైట్ లోకి హీరోయిన్ నగ్న ఫొటో ఎలా వచ్చిందో తమకు తెలియడం లేదని అధికారులు అంటున్నారు. వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురై ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై అంతర్గత విచారణ జరుపుతున్నారు. దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. కాగా, సన్నీ లియోన్ కు సంబంధించిన సోషల్ నెట్ వర్కింగ్ ప్రొఫైల్స్ గతంలో హ్యాకింగ్ కు గురైన సంగతి తెలిసిందే. ఆమె ఫొటోలను హ్యాకర్లు దుర్వినియోగం చేశారు.