డిటెండ్ చేశారని... | Student commit suicide | Sakshi
Sakshi News home page

డిటెండ్ చేశారని...

Nov 4 2015 12:15 PM | Updated on Sep 3 2017 12:00 PM

కళాశాల యాజమాన్యం డిటెండ్ చేసిందని మనస్తాపానికి గురైన విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

కళాశాల యాజమాన్యం డిటెండ్ చేసిందని మనస్తాపానికి గురైన విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది.

వివరాలు.. రంగారెడ్డి జిల్లా మెడ్చెల్‌లోని సీఎమ్మార్ కళాశాలలో బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతున్న భార్గవ్(20)  రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల నుంచి డిటెండ్ చేయడంతోనే మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని  తోటి విద్యార్థులు అరోపిస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ఆగ్రహించిన తోటి విద్యార్థులు కళాశాల వద్ద ఆందోళన నిర్వహించారు. కళాశాల యాజమన్యం తీరు వల్లే భార్గవ్ చనిపోయాడని వారు ఆరోపించారు.



 

Advertisement
 
Advertisement
Advertisement