సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అదృశ్యం... | Software engineer goes missing in gachibowli | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అదృశ్యం...

May 17 2017 8:28 AM | Updated on Jul 29 2019 5:31 PM

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అదృశ్యం... - Sakshi

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అదృశ్యం...

సాఫ్ట్‌వేర​ ఇంజినీర్‌ అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

హైదరాబాద్‌ : సాఫ్ట్‌వేర​ ఇంజినీర్‌ అదృశ్యమైన సంఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్‌ కథనం ప్రకారం ....వరంగల్‌ జిల్లాకు చెందిన కిరణ్‌ కుమార్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తూ మూడు రోజుల క్రితమే ఇండియాకు తిరిగి వచ్చాడు. ట్రాన్స్‌పోర్ట్‌ పేపర్ల కోసం వరంగల్‌ నుంచి భార్య అశ్వినితో కలసి సోమవారం గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని హనీవెల్‌ కంపెనీకి వచ్చాడు. కిరణ్‌ భార్య కంపెనీ మొదటి గేటు దగ్గరే వేచి ఉండగా, అతడు లోపలికి వెళ్లాడు.

మధ్యాహ్నం 3.30 గంటలకు ల్యాండ్‌ లైన్‌ నుంచి భార్యకు ఫోన్‌చేసి మరో రెండు గంటల సమయం పడుతుందని చెప్పాడు. సాయంత్రం వరకూ ఆమె అక్కడే ఉన్నా కిరణ్‌ బయటకు రాకపోవడంతో కంపెనీ సెక్యూరిటీని వాకబు చేయగా, అతడు రెండు గంటల క్రితమే బయటకు వెళ్లిపోయినట్లుత తెలిపారు. దీంతో ఆమె మంగళవారం గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement