వినియోగదారుల కోసం ఎస్‌బీఐ 'ఆన్‌ వీల్స్' | SBI launches 'Bank on Wheels' in Hyderabad | Sakshi
Sakshi News home page

వినియోగదారుల కోసం ఎస్‌బీఐ 'ఆన్‌ వీల్స్'

Mar 10 2016 8:25 PM | Updated on Sep 4 2018 5:07 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు వినియోగదారుల ఇంటి ముంగిట్లోకి రానున్నాయి.

సుల్తాన్‌బజార్ (హైదరాబాద్) : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవలు వినియోగదారుల ఇంటి ముంగిట్లోకి రానున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో 'ఆన్‌ వీల్స్' పేరిట బ్యాంక్ సేవలు అందించేందుకు ఎస్‌బీఐ బస్ సేవలను ప్రారంభించింది. గురువారం కోఠిలోని ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయంలో ఎస్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ హర్‌దయాళ్ బస్ బ్యాంక్ సేవలను ప్రారంభించారు.

ఈ మొబైల్ బస్ బ్యాంకు సేవల్లో ఖాతా తెరవడం, నగదు జమ, నగదు తీసుకోవడం, పాస్‌బుక్ ప్రింటింగ్ తదితర సేవలు  లభ్యమవుతాయని తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో 1426 ఏటీఎంలు, ఆంధ్రప్రదేశ్‌లో 2581 ఏటీఎంలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇరు రాష్ట్రాలలో 155.22 లక్షల డెబిట్ కార్డులు ఇచ్చామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement