రైల్లో మత్తుమందిచ్చి దోపిడీ | robbery in godavari Express with anesthesia | Sakshi
Sakshi News home page

రైల్లో మత్తుమందిచ్చి దోపిడీ

Nov 19 2015 12:59 PM | Updated on Sep 4 2018 5:07 PM

రైల్లో మత్తుమందిచ్చి దోపిడీ - Sakshi

రైల్లో మత్తుమందిచ్చి దోపిడీ

విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కుటుంబానికి గుర్తు తెలియని వ్యక్తులు మత్తు మందిచ్చి దోపిడీకి పాల్పడ్డారు.

విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కుటుంబానికి గుర్తు తెలియని వ్యక్తులు మత్తు మందిచ్చి దోపిడీకి పాల్పడ్డారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీబోగీలో ప్రయాణిస్తున్న విశాఖకు చెందిన ఓ తండ్రి, తల్లి, కుమారుడు  గురువారం రాత్రి ఏసీ బోగీలో హైదరాబాద్ బయలుదేరారు. రాత్రి వేళలో వారికి గుర్తు తెలియని వ్యక్తులు మత్తు మందు కలిపిన బాదం మిల్క్ సరఫరా చేసి వారి వద్ద ఉన్న నగలు, నగదుతో పాటు సెల్‌ఫోన్లను దోచుకున్నారు. గురువారం ఉదయం వారు నాంపల్లి చేరుకున్న తర్వాత  స్పృహలోకి వచ్చిన బాధితులు  రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. తాడే పల్లి - ఏలూరు మధ్యలో మత్తు మందు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement