బీసీ జాబితాలో చేర్చండి | r krishnaiah on bc's | Sakshi
Sakshi News home page

బీసీ జాబితాలో చేర్చండి

Feb 14 2018 3:52 AM | Updated on Feb 14 2018 3:52 AM

r krishnaiah on bc's - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీసీ జాబితా నుంచి తెలంగాణ ప్రభుత్వం తొలగించిన 26 కులాలను వెంటనే ఆ జాబితాలో చేర్చాలని కోరుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య మంగళవారం లేఖ రాశారు. ఇటీవల జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో ఈ డిమాండ్‌ను ఏకగీవ్రంగా తీర్మానించారని లేఖలో ఆయన గుర్తు చేశారు.

జాబితా నుంచి తొలగించిన కులాల వారికి ఫీజులు, ఉపకార వేతనాలు రాకపోవడంతో ఉన్నత విద్యను చదవలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కూడా వారికి అర్హత లేకుండా పోయిందన్నారు. జాబితా నుంచి కులాలను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. బీసీ కమిషన్‌ ద్వారా మాత్రమే జాబితాలో ఏ కులాన్ని అయినా చేర్చడం, తొలగించడం చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement