సికింద్రాబాద్ సర్కిల్ జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం మహాహరితహారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
సికింద్రాబాద్ సర్కిల్ జీహెచ్‌ఎంసీ అధికారులు సోమవారం మహాహరితహారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం 21 ప్రాంతాలను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల పర్యవేక్షణ కోసం 21 మంది నోడల్ అధికారులను నియమించారు. మహా హరితహారం సందర్భంగా సర్కిల్ పరిధిలో ఒక్కరోజే 7188 మొక్కలు నాటేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. మహాహరితహారంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారంతా సమీపంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ఈడీ విజయరాజు చెప్పారు.