
అమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా
గత 25 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి 'పురచ్చితలైవి' జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్వీట్‌లో తెలిపారు.
గత 25 రోజులుగా చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి 'పురచ్చితలైవి' జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు వైఎస్ఆర్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ట్వీట్‌లో తెలిపారు. ఆమె వీలైనంత త్వరగా మళ్లీ ప్రజాసేవలోకి వచ్చేందుకు దేవుడు ఆమెను అనుమతించాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు.
తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్, మధుమేహంతో సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత, అప్పటి నుంచి అక్కడే ఉన్నారు. లండన్ నుంచి, ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి కూడా ప్రత్యేక వైద్యులు వచ్చి ఆమె చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. ఆమె వద్ద ఉన్న ప్రభుత్వ శాఖలను ఆర్థికమంత్రి పన్నీరు సెల్వంకు అప్పగించిన విషయం కూడా తెలిసిందే.
Praying for the speedy recovery of Puratchi Talaivi J. Jayalalitha. May God allow her to be in service of the people at the earliest
— YS Jagan Mohan Reddy (@ysjagan) 15 October 2016